ఫ్యాక్షన్ సినిమాలతో కెరీర్ స్టార్ట్ చేసి యాక్షన్ విత్ కామెడీ సినిమాలు చేస్తూ అందరినీ అలరిస్తున్న డైరెక్టర్ వివి వినాయక్ గారు పుట్టిన రోజు ఈ రోజు. 1974 అక్టోబర్ 9న పశ్చిమ గోదావరి జిల్లా లోని చాగల్లు అనే గ్రామంలో జన్మించిన ఆయన బాల్యం అంత సినిమాతో గడిచింది. ఎలాగంటే ఆన తండ్రి కృష్ణా రావు ఎగ్జిబిటర్ కావడం వాళ్ళ అయనకి సినిమాలంటే ఆసక్తి కలిగింది. జూనియర్ ఎన్టీఆర్ తో చేసిన మొదటి సినిమా ‘ఆది’ తోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఆయన ఆ తరువాత అపజయం అంటూ ఎరుగలేదు. మెగా స్టార్ చిరంజీవితో కలిసి తీసిన ఠాగూర్ ఆయన కెరీర్లో ఒక మైలురాయి అని చెప్పుకోవచ్చు. ప్రభాస్ తో తీసిన నిరాశ పరచగా యోగి బద్రీనాథ్ అనుకున్నంత స్థాయిలో హిట్ కానప్పటికీ కమర్షియల్ హిట్ అయింది. ఈ రెండు మినహా ఇప్పటి వరకు అపజయం ఎరుగ లేదు. త్వరలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయంలో ‘నాయక్’ సినిమా రూపొందిస్తున్న ఆయన సంక్రాంతి రేసులో ఆ సినిమాని నిలబెడతాను అంటున్నారు.
123తెలుగు.కాం తరపున వివి వినాయక్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.