హ్యాపీ బర్త్ డే టు సూపర్ స్టార్ కృష్ణ

హ్యాపీ బర్త్ డే టు సూపర్ స్టార్ కృష్ణ

Published on May 31, 2013 7:18 AM IST

krishna
అందరూ మెచ్చుకునే నటుడిగానే కాకుండా, మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా కూడా పేరు తెచ్చుకున్న సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టిన రోజు ఈ రోజు. కృష్ణ గారు 1943 మే 31న గుంటూరు జిల్లాలోని బుర్రిపాలెంలో జన్మించారు. ఈ రోజు ఆయన తన 70 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాడు.

సుమారు 4 దశాబ్దాలు పాటు సాగిన ఆయన సినీ ప్రస్థానంలో కృష్ణ గారు డిటిఎస్, కలర్ ఫిల్మ్, 70ఎంఎం, సినిమాస్కోప్ లాంటి ఎన్నో కొత్త టెక్నాలజీలను తెలుగు సినిమాకి పరిచయం చేసారు. కృష్ణ గారు సుమారు 350 పైగా సినిమాల్లో నటించి ఎన్నో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ ని తన ఖాతాలో వేసుకున్నారు. ‘దేవుడు చేసిన మనుషులు’, ‘అల్లూరి సీతారామరాజు’, ‘మోసగాళ్ళకి మోసగాడు’, ‘పండంటి కాపురం’,’అవే కళ్ళు’,’కొల్లేటి కాపురం’ మొదలైన ఫేమస్ సినిమాలను ఆయన చేసారు. ఎవరన్నా సహాయం అడిగితే వెనుకాడకుండా సహృదయంతో ముందుకొచ్చి సాయం చేసే ఆయనకి ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.

కృష్ణ గారి పుట్టిన రోజు సందర్భంగా 123తెలుగు.కామ్ తరపున సూపర్ స్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

తాజా వార్తలు