విలక్షణ దర్శకుడికి జన్మదిన శుభాకాంక్షలు

విలక్షణ దర్శకుడికి జన్మదిన శుభాకాంక్షలు

Published on Aug 17, 2013 10:30 AM IST

Shankar

ఆయనే కాదు ఆయన సినిమాలు కూడా భారీగా వుంటాయి. అందుకే ఆ సినిమాలకు భారీ హిట్లు, భీభత్సమైన రికార్డులు సొంతమవుతాయి. తెరపై విలక్షణం చూపించడం ఆయన లక్షణం. ఆయన మరెవరో కాదు ఇండియన్ డైరెక్టర్ల అగ్ర జాబితాలో ఎల్లప్పుడూ వుండే శంకర్. తమిళనాడు కుంబకోణంలో పుట్టిన ఆయన నేడు 50వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. సినిమాలకు రాకముందు మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన ఆయన అప్పట్లో స్నేహితులతో నాటకాలు వేసేవారు. డైరెక్టర్ ఎస్.ఏ చంద్రశేఖర్ శంకర్ ప్రతిభను గుర్తించి అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎంచుకున్నారు

పలు సినిమాలకు అసిస్టెంట్ గా పనిచేసిన తరువాత ‘జెంటిల్ మాన్’ సినిమాతో మెగాఫోన్ పట్టి ఘనవిజయాన్ని అందుకున్నారు. అందరి దక్షిణాది అగ్రతారలతో పనిచేసిన ఆయన ప్రభుదేవాను హీరోగా పరిచయంచేశారు. ‘ప్రేమికుడు’, ‘భారతీయుడు’, ‘జీన్స్’, ‘ఒకే ఒక్కడు’, ‘శివాజీ’, ‘అపరిచితుడు’ వంటి దృశ్యకావ్యాలను మనకందించారు

‘రోబో’ సినిమాతో హాలీవుడ్ రేంజ్ గ్రాఫిక్స్ ను మనకు రుచిచూపించారు. ఈయన సినిమాలకు ఏ.ఆర్ రెహమాన్ స్వరాలతో విడదీయలేని బంధంవుంది. సినిమాలలో భారీ తనమే కాకుండా వ్యవస్థపై వున్న లోటుపాట్లను చూపించడం శంకర్ స్టైల్.. ప్రస్తుతం ఈయన విక్రంతో ‘మనోహరుడు’ సినిమా షూటింగ్ తుదిదశలో వున్నారు.

123telugu.com ద్వారా ఈ విలక్షణ దర్శకుడికి జన్మదిన శుభాకాంక్షలుతెలియజేస్తున్నాం

తాజా వార్తలు