రామ్ గోపాల్ వర్మ కి జన్మదిన శుభాకాంక్షలు

రామ్ గోపాల్ వర్మ కి జన్మదిన శుభాకాంక్షలు

Published on Apr 7, 2012 10:17 AM IST

భారతీయ చలన చిత్ర పరిశ్రమ లో ఎంతమంది ఇష్టపడుతున్నారో అంతే మంది ద్వేషిస్తున్నారు, ఇలా ఇష్టాన్ని ద్వేషాన్ని సమపాళ్ళలో కలిగిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఈ దర్శకుడు ప్రజల భావాలను వేలికితీయటంలో నిపుణుడు అది ప్రేమయినా ద్వేషమయినా . 1962 ఏప్రిల్ 7న జన్మించిన ఈ దర్శకుడు ఈరోజుతో యాబై ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. 1989లో “శివ” చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకి ఒక మైలు రాయిని ఏర్పరిచిన ఈ దర్శకుడు ప్రస్తుత తరం దర్శకులలో చాలా మందికి స్పూర్తిగా నిలిచారు.”క్షణ క్షణం”,”అంతం” మరియు “గోవిందా గోవిందా” వంటి చిత్రాలను తెలుగులో అందించాక రాము బాలివుడ్ కి వెళ్ళిపోయారు.

ఇప్పటికి హిందీలో పాతుకుపోయిన దక్షణాది దర్శకుడు రాము ఒక్కడే. గ్యాంగ్ స్టర్ మరియు మాఫియా చిత్రాలంటే ఇష్టపడే ఈ దర్శకుడు కామెర యాంగిల్స్ పెట్టడంలో తనదయిన శైలిని ఏర్పరుచుకున్నారు. ఈ వేసవికి రాము దర్శకత్వం వహించిన “డిపార్టుమెంటు” చిత్రం విడుదల కానుంది. అతనంటే ఇష్టపడినా లేకపోతే ద్వేషించినా ఒక్కటి మాత్రం చెప్పగలము అలాంటి దర్శకుడు మరొకరు ఉండరు. హ్యాపీ బర్త్ డే రాము నువ్వు ఇలానే నీకు తోచినట్టు ఉంటావని కోరుకుంటున్నాం.

తాజా వార్తలు