మాస్ మహారాజ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు

మాస్ మహారాజ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు

Published on Jan 26, 2013 9:47 AM IST

Ravi-Teja-B-dat

మాస్ మహారాజ రవితేజ ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు 90వ దశకంలో సహాయ పాత్రలతో తన కెరీర్ ని మొదలు పెట్టిన రవితేజ ఈరోజు ఇండస్ట్రీ లో పేరొందిన హీరోలలో ఒకరు. ఈ స్థాయికి చేరుకోవడానికి ఆయన చాలా కష్టపడ్డారు. “ఇడియట్” మరియు “అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి” వంటి చిత్రాలతో పూరి జగన్నాథ్ రవితేజ కెరీర్ కి బాగా సహాయపడ్డారు. “వెంకి”,”విక్రమార్కుడు” మరియు “దుబాయ్ శీను” వంటి చిత్రాలతో మాస్ లో తనకంటూ ఒక క్రేజ్ తెచ్చిపెట్టుకున్నారు తరువాత కొద్దిగా వెనకబడినా సురేందర్ రెడ్డి “కిక్” చిత్రంతో తిరిగి ట్రాక్ లోకి వచ్చారు. గత కొద్ది రోజులుగా ఎటువంటి హిట్ లేకపోయినా అయన రాబోతున్న చిత్రం “బలుపు” మీద చాలా అంచనాలు ఉన్నాయి. గతంలో “డాన్ శీను” చిత్రానికి దర్శకత్వం వహించిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రానున్న ఈ చిత్రంలో శృతి హాసన్ మరియు అంజలి లు కథానాయికలుగా కనిపించనున్నారు. నిన్న సాయంత్రం విడుదల చేసిన టీజర్ కి మంచి స్పందన లభించింది. బలుపు చిత్ర విజయంతో రవితేజ బాక్స్ ఆఫీస్ వద్ద తనేంటో నిరూపించుకోనున్నారు అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రసాద్ వి పోట్లురి నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.

తాజా వార్తలు