యంగ్ హీరోకు జన్మదిన శుభాకాంక్షలు

యంగ్ హీరోకు జన్మదిన శుభాకాంక్షలు

Published on Jun 1, 2013 12:03 PM IST

nikhil

‘మా అయ్య పొద్దుటూరు ఎం.ఎల్.ఏ’ అనే డైలాగ్ కొట్టి, శేఖర్ కమ్ముల ‘హ్యాపీడేస్’ సినిమాలో తనదైన డైలాగ్ డెలివరీతో యువత మనసులను కొల్లగొట్టిన నటుడు నిఖిల్. ఆ సినిమా అందించిన విజయంతో ‘యువత’ సినిమాలో ఛాన్స్ దక్కించుకుని మరో విజయాన్ని అందుకున్నాడు. అయితే ‘ఆలస్యం… అమృతం’, ‘కళావర్ కింగ్’, ‘వీడు తేడా’ వంటి సినిమాలు వరుసగా పరాజయం పాలు అవ్వడంతో కాస్త నిరాశ చెందాడు. కానీ ఇటీవల సుధీర్ వర్మ తీసిన ‘స్వామి రారా’ సినిమాతో హిట్ సాధించి తిరిగి ఫామ్ ను అందుకున్నాడు. ప్రస్తుతం నిర్మాత వెంకట శ్రీనివాస్ బొగ్గారం మ్యగ్నస్ సినీ ప్రైమ్ ప్రై. లిమిటెడ్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.1గా జూన్ 10న సినిమా ప్రారంభంకానుంది. చందు మొందేటి దర్శకత్వం వహించనున్నాడు. మరి ఈ యంగ్ హీరో సినిమా విజయం సాధించాలని కోరుకుంటూ 123తెలుగు ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

తాజా వార్తలు