అందం, అభినయం రెండూ కలగలిపిన మళయాళ కుట్టి నయనతార సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా వెలుగొందుతోంది. అలాంటి నయన్ పుట్టిన రోజు ఈ రోజు. డయానా మరియం కురైన్ పేరుతో జన్మించిన నయన్ తన చదువును ఇండియాలోని పలు ప్రదేశాల్లో పూర్తి చేసారు. ఎక్కువభాగం నార్త్ ఇండియాలోనే చదివారు. మలయాళంలో 2003లో వచ్చిన ‘మనస్సినక్కరే’ ద్వారా తెరకు పరచయమై, 2004లో వచ్చిన ‘విస్మయతుంబతు’తో తొలి సక్సెస్ అందుకున్నారు. రజినీకాంత్ సరసన నటించిన ‘చందముఖి’ సినిమా ద్వారా నయనతార లైం లైట్ లోకి వచ్చింది.
‘లక్ష్మీ’ సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయమైన ఈ భామ ఆ తర్వాత వచ్చిన ‘గజిని’, ‘తులసి’, ‘సింహా’ లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించారు, అలాగే గత సంవత్సరం వచ్చిన ‘శ్రీ రామరాజ్యం’ సినిమా ద్వారా విమర్శకుల ప్రశంశలను అందుకున్నారు. ఆ సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకొని చేస్తున్న ‘కృష్ణం వందే జగద్గురుమ్’ సినిమా ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది కాకుండా తెలుగులో ఒకటి మరియు తమిళంలో రెండు సినిమాలు చేస్తూ నయనతార బిజీగా ఉంది.
ఇంకా ఎన్నో మంచి చిత్రాల్లో నటించాలని కోరుకుంటూ నయనతారకి 123తెలుగు.కామ్ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.