‘కింగ్’ నాగార్జునకి జన్మదిన శుభాకాంక్షలు

‘కింగ్’ నాగార్జునకి జన్మదిన శుభాకాంక్షలు

Published on Aug 29, 2013 8:33 AM IST

happy-birthday-nag

అక్కినేని నాగేశ్వర రావుకి నట వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన కింగ్ అక్కినేని నాగార్జున పుట్టిన రోజు ఈ రోజు. టాలీవుడ్ మన్మధుడు అని పిలుచుకునే నాగ్ 1959 ఆగష్టు 29న అక్కినేని నాగేశ్వరరావు – శ్రీమతి అన్నపూర్ణ దంపతులకు చెన్నైలో జన్మించాడు. నాగార్జున తన చిన్నతనాన్ని హైదరాబాద్, చెన్నైలో గడిపాడు. ఈస్టర్న్ మిచిగన్ యూనివర్సిటీ నుంచి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లో ఎంఎస్ చేసిన తర్వాత నాగార్జున 1986లో ‘విక్రమ్’ సినిమాతో హీరోగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.

నాగార్జున ఎప్పటికప్పుడు కొత్త కొత్త సినిమాలు చేస్తూ తనని తానూ తెరపై ఆవిష్కరించుకున్నాడు. కొత్త రకమైన సినిమాలు చెయ్యాలి అన్న ప్రతిసారి ఏ మాత్రం వెనకాడకుండా సినిమాలు చేసేవాడు. ‘శివ’, ‘గీతాంజలి’, ‘నిన్నే పెళ్ళాడతా’, ‘మన్మధుడు’ లాంటి సినిమాలతో ప్రత్యేకతని చాటుకోవడమే కాకుండా ఆ సినిమాలు ఇండస్ట్రీలో స్పెషల్ సినిమాలు అయ్యేలా చేసాడు. అలాగే ‘అన్నమయ్య’, ‘శ్రీ రామదాసు’ లాంటి భక్తిరస సినిమాలతో నాగార్జున తనలోని వైవిధ్యమైన నటనను తెరపై చూపించి పేరు తెచ్చుకున్నాడు. నాగార్జున త్వరలోనే ‘భాయ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న అక్కినేని నాగార్జునకి 123తెలుగు.కామ్ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం..

తాజా వార్తలు