పంచ్ డైరెక్టర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు

పంచ్ డైరెక్టర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు

Published on Sep 28, 2013 9:35 AM IST

puri
అప్పటిదాకా సినిమాలో హీరో అంటే ఒక అంతస్తు. హీరోలా ఎవరూ నడవలేరు, అతనిలా ఎవరూ డైలాగ్ చెప్పలేరు, ఫైట్ చేయలేరు. కానీ వీటన్నిటి పక్కనపెట్టి తనదైన శైలిలో హీరో క్యారక్టర్ ను డిజైన్ చేసి ప్రతీ ప్రేక్షకుడు హీరోలో తనని తానుచూసుకునేలా చేసాడు. అపారమైన రచనా జ్ఞానం, అంతకు మించిన సెన్స్ ఆఫ్ హ్యూమర్ కలిగిన దర్శకుడు పూరీ జగన్నాధ్. 2000లో పవన్ కళ్యాన్ తో ‘బద్రి’ సినిమాతో దర్శకుడిగా మొదలైన అతని ప్రయాణం అతన్ని ఈ తరం టాప్ డైరెక్టర్లలో ఒకరిగా నిలిపింది. పూరీకి రామ్ గోపాల్ వర్మ అంటే చాలా ఇష్టం. విశాఖ జిల్లా నర్సిపట్నంలో పుట్టిన పూరీ మొదట్లో రాము దగ్గర అసిస్టెంట్ గా పని చేశాడు

తెలుగులో రవితేజ కు ‘ఇట్లు శ్రావణి సుభ్రమణ్యం’, ‘ఇడియట్’ సినిమాలతో బ్రేక్ ఇచ్చి మూడు నందులను అందుకున్నాడు.పూరికి మరో జన్మంటు వుంటే బ్రూస్ లీ గా పుట్టాలని కోరికట. తన అభిమాన తార శ్రీ దేవి అని పలు మార్లు చెప్పుకొచ్చాడు. వైష్ణో అకాడమీ, పూరీ జగన్ టూరింగ్ టాకీస్ పేర్లతో నిర్మాణ సంస్థలు ఆయన సొంతం. ప్రస్తుతం నితిన్ తో కలిసి ‘హార్ట్ ఎటాక్’ సినిమా తీసే పనిలో బిజీగా వున్న పూరికి 123తెలుగు.కామ్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం

సంబంధిత సమాచారం

తాజా వార్తలు