హను రాఘవపూడి చేతుల మీదుగా ‘అర్జున్ చక్రవర్తి’ టీజర్ లాంచ్

విజయ రామరాజు టైటిల్ రోల్ పోషించిన స్పోర్ట్స్ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి’. విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాని నిర్మాత శ్రీని గుబ్బల నిర్మించారు. తాజాగా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హను రాఘవపూడి సినిమా టీజర్ ని లాంచ్ చేశారు. ఓ కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా తీసుకొని రూపొందిన ఈ మూవీ టీజర్ ప్రేక్షకులని కట్టిపడేసింది.

ఈ సందర్భంగా డైరెక్టర్ విక్రాంత్ రుద్ర మాట్లాడుతూ.. ‘నేను 12 ఏళ్ల పిల్లాడిగా ఉన్నప్పుడు ఒక పర్సన్ ని కలిసాను. ఆ పర్సన్ పేరు అర్జున్ చక్రవర్తి. ఆయన దగ్గర నేను కబడ్డీ ట్రైనింగ్ కోసం వెళ్ళినప్పుడు ఆయన ఒక కథ చెప్పారు. అది నా మనసులో అలాగా నాటుకుపోయింది. ఆ కథని ఎలాగైనా ప్రపంచానికి చెప్పాలని భావించాను. అలా ఈ కథ నేను డైరెక్టర్ కావడానికి డ్రైవ్ చేసింది. నిర్మాత శ్రీని గారికి కథ చెప్పిన తర్వాత ఆయనకి నచ్చింది. వెంటనే ఓకే చెప్పారు. ఆయన సపోర్ట్ లేకుండా ఈ సినిమా నేను చేసే వాడినే కాదు. ఈ ఆరేళ్ల జర్నీలో ఆయన ప్రతి మూమెంట్ లో సపోర్ట్ చేశారు. ఈ సినిమాని 120 లొకేషన్స్ లో షూట్ చేశాం. మా హీరో విజయ్ గారు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఎలాంటి ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ కావాలన్నా అది చేసి చూపించారు. మైనస్ డిగ్రీల్లో షూట్ చేసాం. డిఓపి జగదీష్ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేసాడు. సినిమాలో మ్యూజిక్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో ఉంటుంది. మా హీరోయిన్ సిజ్జా రోజ్ చాలా హార్డ్ వర్క్ చేసింది. ఈ సినిమా ప్రొడక్షన్ డిజైన్ అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.’ అని అన్నారు.

హీరో విజయరామరాజు మాట్లాడుతూ.. ‘టీజర్ చూసిన ప్రతి ఒక్కరూ చాలా అద్భుతంగా ఉందని చెబుతున్నారు. ఇది చాలా ఆనందాన్నిచ్చింది. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరూ చాలా అద్భుతమైన వర్క్ చేశారు. మ్యూజిక్. విజువల్స్ ఇవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. హీరోయిన్ సిజ్జా ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేసింది. ఈ సినిమాతో తనకు మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను. మా నిర్మాత శ్రీని గారు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా సినిమాని అద్భుతంగా రూపొందించారు. మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా నిర్మాతకి ధన్యవాదాలు. నా జీవితంలో గుర్తుండిపోయే సినిమా ఇది. మీరందరూ సపోర్ట్ చేసి ముందుకు తీసుకువెళ్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను’ అని అన్నారు.

ప్రొడ్యూసర్ శ్రీని గుబ్బల మాట్లాడుతూ.. ‘డైరెక్టర్ ఈ కథ చెప్పినప్పుడు నాకు చాలా నచ్చింది. ఈ సినిమా కథ చెప్పినప్పుడు గానీ తీస్తున్నప్పుడు గానీ ఎక్కడ కూడా డ్రాప్ అయినట్లు అనిపించలేదు. అందుకే ప్రొడక్షన్ లో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమాని చేయడం జరిగింది. విజయ్ ట్రాన్స్ఫర్మేషన్ అయ్యారు. ఆయన హార్డ్ వర్క్ టీజర్ లో మీరందరూ చూశారు. చాలా అద్భుతమైన విజువల్స్, ఎమోషన్స్, కథ ఉన్న సినిమా ఇది. అజయ్ గారు కోచ్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. అలాగే హీరోయిన్ సిజ్జా రోజ్ గారు చాలా నేచురల్ గా ఈ క్యారెక్టర్ ని చేశారు. అందరూ కూడా మీ ఇంట్లో ఒక అమ్మాయిగానే భావిస్తారు. ఈ సినిమాకి మీరంతా సపోర్ట్ చేయాలని కోరుతున్నాను’ అని అన్నారు.

హీరోయిన్ సిజ్జా రోజ్ మాట్లాడుతూ.. ‘ఇది నా ఫస్ట్ తెలుగు సినిమా. ఇది ఒక ఐదేళ్ల జర్నీ. చాలా ప్యాషన్ తో పనిచేసాం. చాలా హార్డ్ వర్క్ చేశాం. మా నిర్మాత ఎంతగానో సపోర్ట్ చేశారు. ఆయన సపోర్ట్ లేకపోతే ఈ సినిమా అయ్యేది కాదు. మా డైరెక్టర్ గారు తన విజన్ ని అద్భుతంగా చూపించారు. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది’ అని అన్నారు.

Exit mobile version