ఆర్ ఆర్ ఆర్ లో ఆ రెండు సన్నివేశాలకే సగం బడ్జెట్ అట.

ఆర్ ఆర్ ఆర్ లో ఆ రెండు సన్నివేశాలకే సగం బడ్జెట్ అట.

Published on Jan 15, 2020 9:10 AM IST

రాజమౌళి ఇద్దరు టాప్ స్టార్స్ తో తెరకెక్కిస్తున్న పీరియాడిక్ మల్టీ స్టారర్ ఆర్ ఆర్ ఆర్ పై రోజుకొక సంచలన వార్త బయటికి వస్తుంది. ఈచిత్రం పై ఉన్న ఆసక్తిరీత్యా ఈ చిత్రం గురించిన ప్రతి విషయం సంచలనంగా మారుతుంది. తాజా సమాచారం ప్రకారం ఆర్ ఆర్ ఆర్ లో రెండు ముఖ్య ఘట్టాలైనా ఇంటర్వల్ మరియు క్లైమాక్స్ లో వచ్చే పోరాట సన్నివేశాలకు రాజమౌళి సగం బడ్జెట్ కేటాయిస్తున్నారట. అలాగే ఇంటర్వెల్ బ్యాంగ్ సన్నివేశంలో ఎన్టీఆర్, చరణ్ లు కొమరం భీమ్.. అల్లూరి సీతారామ రాజులుగా బ్రిటిష్ సైన్యంపై యుద్ధం చేస్తారట. ఈ యుద్ధ సన్నివేశం విజువల్ వండర్ గా తీర్చిద్దిడానికి రాజమౌళి భారీ బడ్జెట్ కేటాయించారట. ఇక పతాక సన్నివేశాలలో వచ్చే పోరాట సన్నివేశాలపై కూడా జక్కన్న ప్రత్యేక శ్రద్ద పెట్టి అత్యున్నత విలువలతో తెరకెక్కించనున్నారట.

దీనితో ఆర్ ఆర్ ఆర్ మూవీ బడ్జెట్ లో దాదాపు సగం ఈ రెండు సన్నివేశాలకే జక్కన్న కేటాయించారు అని తెలుస్తుంది. డి వి వి దానయ్య ఈ చిత్రాన్ని 300కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ జులై 30న విడుదల కానున్నట్లు గతంలో ప్రకటించారు.

తాజా వార్తలు