పండగపూట కూడా ఆగని ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ వర్క్

పండగపూట కూడా ఆగని ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ వర్క్

Published on Oct 21, 2025 3:00 AM IST

Andhra-King-Taluka

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు పి.మహేష్ బాబు డైరెక్ట్ చేస్తుండగా పూర్తి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది.

ఇక ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాకు వివేక్-మెర్విన్ సంగీతం అందిస్తున్నారు. అయితే, దీపావళి పండుగ నాడు కూడా ఈ చిత్ర బీజీఎం వర్క్‌లో వారు బిజీగా ఉన్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఇలా పండుగనాడు కూడా తమ టీమ్ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ను పక్కాగా తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఇక ఈ సినిమాలో భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్‌గా నటిస్తుండగా ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని నవంబర్ 28న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

Andhra-King-Taluka

తాజా వార్తలు