వైభవంగా జరిగిన గ్రీకువీరుడు ఆడియో లాంచ్

వైభవంగా జరిగిన గ్రీకువీరుడు ఆడియో లాంచ్

Published on Apr 4, 2013 1:56 AM IST

Greeku Veerudu Audio Launch (22)

ఈ ఈరోజు హైదరాబాద్లో ‘గ్రీకువీరుడు’ సినిమా ఆడియో లాంచ్ వైభవంగా జరిగింది. ఎ.ఎన్.ఆర్, ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం, కే రాఘవేంద్ర రావు, నాగార్జున, నాగచైతన్య, అఖిల్, అక్కినేని అమల , అనుష్క, ప్రియమణి, థమన్, డి శివ ప్రసాద్ రెడ్డి, సుశాంత్, బోయపాటి శీను, వి.వి వినాయక్, కె.ఎల్ నారాయణ మరియు కృష్ణ చైతన్య తదితర ప్రముఖులు ఈ వేడుకకి హాజరయ్యారు.

సుమారు 10 సంవత్సరాల తరువాత మరలా దశరధ్, నాగార్జున కలయికలో ఈ సినిమా తెరకెక్కుతుంది. డి శివ ప్రసాద్ రెడ్డి ఈ సినిమాకి నిర్మాత. ఆనతి కాలంలోనే వేగంగా సినిమాలు చేస్తూ ఎత్తుకి ఎదిగిన థమన్ ని ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం పొగిడారు. తమ కుటుంబానికి చేదోడుగా నిలిచినందుకు నాగేశ్వర రావు, నాగార్జున ప్రత్యేకంగా నిర్మాతని అభినందించారు. ఈ వేడుక ఎటువంటి అపశ్రుతులు దొర్లకుండా పాటలకు ఫాన్స్ విజిల్స్ తో , నాగార్జున అద్బుతమైన లుక్ తో బ్రహ్మాండంగా జరిగింది. నయనతార ఈ సినిమాలో హీరొయిన్. మీరా చోప్రా మరియు బ్రహ్మానందం ముఖ్య పాత్రధారులు. ఈ సినిమా ఏప్రిల్ 19న విడుదల కావచ్చు.

తాజా వార్తలు