పొల్లాచ్చికి వెళ్లిన గౌరవం చిత్ర బృందం

పొల్లాచ్చికి వెళ్లిన గౌరవం చిత్ర బృందం

Published on Oct 2, 2012 3:45 AM IST


అల్లు శిరీష్ మరియు యామి గౌతంలు ప్రధాన పాత్రలలో తెరకేకుతున్న “గౌరవం” చిత్రం ప్రస్తుతం పొల్లాచ్చిలో చిత్రీకరణ జరుపుకుంటుంది. రాధామోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ ద్విభాషా చిత్రాన్ని డ్యూయెట్ మూవీస్ బ్యానర్ మీద ప్రకాష్ రాజ్ నిర్మిస్తున్నారు.సగానికి పైగా చిత్రీకరణ పూర్తయిన ఈ చిత్రం మరో రెండు షెడ్యూల్ లో మొత్తం చిత్రీకరణ పూర్తి చేసుకోనుంది. ఈ మద్ద్యనే ఈ చిత్రం రాజమండ్రి లో చిత్రీకరణ జరుపుకుంది ప్రస్తుతం పొల్లాచ్చిలో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ షెడ్యూల్ తరువాత చిత్ర బృందం కన్యాకుమారి వెళ్తుంది ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించగా ప్రీత సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సామజిక అంశాల మీద ఈ చిత్రం ఉండబోతుంది. మరిన్ని విశేషాలను త్వరలో వెల్లడిస్తారు.

తాజా వార్తలు