హిట్ కొట్టినా కూడ గోపిచంద్ మలినేనికి కష్టాలు తప్పలేదు

హిట్ కొట్టినా కూడ గోపిచంద్ మలినేనికి కష్టాలు తప్పలేదు

Published on Feb 6, 2021 3:00 AM IST


‘క్రాక్’.. ఈ ఏడాది టాలీవుడ్ బాక్సాఫీస్ చూసిన మొదటి హిట్. లాక్ డౌన్ అనంతరం విడుదలైన సినిమాల్లో ఇప్పటివరకు ఇదే భారీ బ్లాక్ బస్టర్. ఈ విజయంతో రవితేజ మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కారు. హీరోయిన్ శృతిహాసన్ మరోసారి ఫామ్లోకి వచ్చింది. ఇక సినిమాను నిర్మించిన నిర్మాత, కొన్న డిస్ట్రుబ్యూటర్లు ఇలా అందరూ లాభపడ్డారు. కానీ విజయానికి మూల కారణమైన దర్శకుడు గోపిచంద్ మలినేని మాత్రం ఇబ్బందులు పడుతున్నారు. అది కూడ నిర్మాత వైపు నుండి కావడం గమనార్హం.

ఈ సినిమాకు అందాల్సిన పూర్తి పారితోషకం ఇంకా అండలేదట మలినేనికి. అగ్రిమెంట్ మేరకు మాట్లాడుకున్న పూర్తి రెమ్యునరేషన్లో 30 లక్షలు మాత్రం సినిమా విడుదలయ్యాక చెల్లించేటట్టు అగ్రిమెంట్ చేస్తుకున్నారట నిర్మాత ఠాగూర్ మధు. సినిమా విడుదలైంది, పెద్ద విజయం అందుకుంది. కానీ నిర్మాత నుండి అందాల్సిన బ్యాలెన్స్ మాత్రం అందలేదట దర్శకుడికి. దీంతో ఆయన నేరుగా నిర్మాతల మండలిని ఆశ్రయించి నిర్మాత మీద పిర్యాధు చేశారట. ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్ నడుస్తోంది. మరి చూడాలి ఈ పంచాయతీ ఎలా తెగుతుందో.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు