ఒక్క హిట్‌తో మళ్లీ పాత బడ్గెట్లోకి బెల్లంకొండ

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా సినిమా అంటే స్క్రీన్ మీద ఖర్చు భారీగానే కనబడేది. కానీ ఆ మధ్య ‘సాక్ష్యం, సీత, కవచం’ లాంటి ఫ్లాప్స్ పడటంతో ఇంతకుముందులా భారీ బడ్జెట్ పెట్టడానికి నిర్మాతలు ఒకింత వెనుకాడారు. అందుకే కొద్దిగా తక్కువ బడ్జెట్లోనే ‘రాక్షసుడు’ చిత్రాన్ని కానిచ్చేశారు. అయితే ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకుని లాభాల్ని తెచ్చింది. శ్రీనివాస్ నటనకు కూడా మంచి మార్కులే పడ్డాయి. మార్కెట్ కొద్దిగా కుదురుకుంది. దీంతో పాత బడ్జెట్ స్థాయికే వచ్చేశాడు హీరో.

ప్రస్తుతం ఆయన సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్లో ఒక యాక్షన్ ఎంటెర్టైనర్ చేస్తున్నారు. జి. సుబ్రహ్మణ్యం, సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు నిర్మాతలు మంచి బడ్జెట్ కేటాయిస్తున్నారట. భారీ ఫైట్ సీన్స్, స్టార్ కాస్టింగ్, ప్రముఖ టెక్నీషియన్లు ఇలా అన్నీ అంశాలకు భారీగానే ఖర్చు పెడుతున్నారట. ఈ చిత్రంలో నభా నటేష్, అను ఎమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటిస్తుండగా సోనూ సూద్ ఒక కీ రోల్ చేస్తున్నారు.

Exit mobile version