ఖరారైన వెంకటేష్ – రామ్ సినిమా టైటిల్

ఖరారైన వెంకటేష్ – రామ్ సినిమా టైటిల్

Published on May 28, 2013 10:50 AM IST

venkatesh-and-ram

విక్టరీ వెంకటేష్ , యంగ్ హీరో రామ్ హీరోలుగా బాలీవుడ్ ‘బోల్ బచ్చన్’ సినిమాని రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా టైటిల్ ని ‘గోల్ మాల్’గా ఖరారు చేశారు. ఈ విషయాన్నిడి. సురేష్ బాబు అధికారికంగా తెలియజేశారు. ఈ సినిమా టైటిల్ ని ‘గరం మసాలా’గా ఇంతకు ముందు అనుకున్నారు. విజయ్ భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మల్టీ స్టారర్ సినిమాని డి. సురేష్ బాబు, స్రవంతి రవి కిషోర్ లు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేష్ తో అంజలి, అలాగే రామ్ తో షాజన్ పదమ్సీ జతకట్టనున్నారు. ఈ సినిమా ఈ సంవత్సరం సెకండాఫ్ లో విడుదలయ్యే అవకాశం వుంది.

తాజా వార్తలు