అక్కినేని వారి యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అక్కినేని నాగ చైతన్య తండేల్ సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకొని సాలిడ్ కం బ్యాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఆ సినిమా తర్వాత విరూపాక్ష దర్శకుడు కార్తీక్ వర్మ దండు తెరకెక్కిస్తున్న క్రేజీ సూపర్ నాచురల్ థ్రిల్లర్ కోసం అందరికీ తెలిసిందే. మరి దీనిపై మంచి అంచనాలు నెలకొనగా మేకర్స్ ఈ సినిమా తాలూకా ఫస్ట్ లుక్ పోస్టర్ ని అలాగే టైటిల్ ని రివీల్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు.
మరి ఈ సినిమా పోస్టర్ లాంచ్ కోసం గ్లోబ్ ట్రాటర్ మహేష్ బాబు రానున్నట్టు అనౌన్స్ చేశారు. రేపు నవంబర్ 22న సినిమా తాలూకా ఫస్ట్ లుక్ ని మహేష్ బాబు ఉదయం 10 గంటల 8 నిమిషాలకి వదులుతున్నట్టు కన్ఫర్మ్ చేశారు. మరి ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ లు ఎలా ఉంటాయో చూడాలి. ఇక ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తుండగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర వారు నిర్మాణం వహిస్తున్నారు.
