‘బిగ్ బాస్’ షోపై మహిళా కమిషన్ కేసు.. షాకింగ్ ఆరోపణలు!

మన దేశ వ్యాప్తంగా మంచి పాపులారిటీ ఉన్న టాప్ రియాలిటీ టెలివిజన్ షోస్ లో బిగ్ బాస్ కూడా ఒకటి. అయితే పాన్ ఇండియా భాషల్లో సూపర్ హిట్ అయ్యిన ఈ షో మన తెలుగులో కూడా విజయవంతంగా 9వ సీజన్ జరుగుతుంది. అయితే లేటెస్ట్ గా ఓ బిగ్ బాస్ షోపై మహిళా కమిషన్ కేసు వేయడం షాకింగ్ గా మారింది.

అయితే ఇది మన తెలుగు బిగ్ బాస్ షో విషయంలో కాదట. స్టార్ హీరో కిచ్చా సుదీప్ హోస్ట్ గా చేస్తున్న కన్నడ బిగ్ బాస్ సీజన్ 12 విషయంలో అన్నట్టు తెలుస్తుంది. ఇంతకీ అసలు ఏమైంది అంటే బిగ్ బాస్ హౌస్ లో కుల వివక్షత చూడటం, మహిళలని అవమానించేలా దుర్భాషలాడడం పైగా శారీరకంగా దాడి చేయడం వంటి అంశాలపై కేసు నమోదు అయినట్టు తెలుస్తుంది.

కర్ణాటకకు చేసిన మహిళా సామాజిక కార్యకర్త సంధ్య పవిత్ర ఈ కేసు ఫైల్ చేశారట. రశిక అనే కంటెస్టెంట్ పై సుదీప్ ఇంకా ఇతర పోటీదారులు అమానుష ప్రవర్తన చూపారని సుదీప్ కూడా ఆమెని అగౌరకరంగా మాట్లాడారు అని ఆమె ఫైల్ చేసినట్టు తెలుస్తుంది. మరి దీనిపై మహిళా కమిషన్ అలాగే బిగ్ బాస్ మేకర్స్ ఇంకా తమ స్పందన అయితే అందించలేదు.

Exit mobile version