లండన్ లో ‘పెద్ది’ మేనియా.!

లండన్ లో ‘పెద్ది’ మేనియా.!

Published on May 14, 2025 10:02 AM IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా యువ దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న సాలిడ్ రూరల్ స్పోర్ట్స్ డ్రామా చిత్రం “పెద్ది” కోసం అందరికీ తెలిసిందే. అయితే పెద్ది చిత్రం దాదాపు 30 శాతం పూర్తి కాగా ఈ సినిమా గ్యాప్ మధ్యలో రామ్ చరణ్ తన వాక్స్ స్టాట్యూ ఇంకా RRR లైవ్ ఆర్కెస్ట్రా కార్యక్రమాలకి హాజరు కావడం జరిగింది.

మరి అలా తన అభిమానులతో లండన్ లో కూడా ముచ్చటించిన గ్లోబల్ స్టార్ కి అక్కడి అభిమానులు ఎంతో ఆప్యాయంగా ఒక స్పెషల్ బ్యాట్ ని పెద్ది సినిమా ఫస్ట్ షాట్ హిట్ అయ్యిన కారణంగా అందించారు. దానిపై రామ్ చరణ్ తన ఆటోగ్రాఫ్ ని చేయడం విశేషం. దీనితో ఈ విజువల్స్ ఇపుడు వైరల్ గా మారాయి. ఇక ఈ అవైటెడ్ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా వచ్చే ఏడాది మార్చ్ 27న రామ్ చరణ్ బర్త్ డే కానుకగా విడుదల కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు