టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో నటుడు సుహాస్ కూడా ఒకరు. మరి సుహాస్ నుంచి ఈ ఏడాది వచ్చిన చిత్రాల్లో థియేట్రికల్ రిలీజ్ కి వచ్చిన చిత్రం “ఓ భామ అయ్యో రామ” కూడా ఒకటి. దర్శకుడు రామ్ గోదాల తెరకెక్కించిన ఈ రోమ్ కామ్ డ్రామా అనుకున్న రేంజ్ లో అంచనాలు రీచ్ కాలేదు.
ఇలా డిజప్పాయిన్మెంట్ నే మిగిల్చిన ఈ సినిమా ఫైనల్ గా ఓటిటి రిలీజ్ కి సిద్ధం అయ్యింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఈటీవీ విన్ వారు సొంతం చేసుకోగా అందులో రేపు ఆగష్టు 1 నుంచే సినిమా అందుబాటులోకి వస్తున్నట్టుగా ఖరారు చేశారు. సో అప్పుడు మిస్ అయ్యి ఓటిటిలో చూడాలి అనుకునేవారు చూడొచ్చు. ఇక ఈ చిత్రానికి రధన్ సంగీతం అందించగా హరీష్ నల్లా నిర్మాణం వహించారు.