నితిన్ గుండెజారి గల్లంతయ్యిందేకి అదిరిపోయే వీకెండ్

నితిన్ గుండెజారి గల్లంతయ్యిందేకి అదిరిపోయే వీకెండ్

Published on Apr 22, 2013 8:20 AM IST
First Posted at 8:20 on Apr 22nd

gunde-jaari-gallanthayyinde

యంగ్ హీరో నితిన్ హీరోగా నటించిన ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఏప్రిల్ 19న రిలీజ్ అయిన ఈ సినిమా అన్ని ఏరియాల్లో ఈ వీకెండ్ సూపర్బ్ కలెక్షన్స్ రాబట్టింది.అన్నిటికన్నా ఎ సెంటర్లలో, ఓవర్సీస్ బాక్స్ ఆఫీసు వద్ద కలెక్షన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఈ సినిమా యుఎస్ డిస్ట్రిబ్యూటర్ ఇప్పటికే లాభాలు వచ్చాయని తెలియజేశారు. ‘ఇష్క్’ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత వచ్చి దానికన్నా సూపర్ సక్సెస్ అవ్వడం, అలాగే పబ్లిక్ రెస్పాన్స్ చూసి నితిన్ ఎంతో సంతోషంగా ఉన్నాడు.

మంచి కామెడీ, గుడ్ రొమాంటిక్ ట్రాక్, హీరో హీరోయిన్స్ ల నటనను ఈ సినిమాకి మేజర్ హైలైట్స్ గా చెప్పుకోవచ్చు. విజయ్ కుమార్ కొండ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి హర్ష వర్ధన్ డైలాగ్స్ రాసాడు. నిత్యా మీనన్, ఇషా తల్వార్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ కంపోజ్ చేసాడు. శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ పై నిఖితా రెడ్డి ఈ సినిమాని నిర్మించారు.

తాజా వార్తలు