నన్ను అమ్మాయిలు అలా ఇష్టపడతారు.!

నన్ను అమ్మాయిలు అలా ఇష్టపడతారు.!

Published on Nov 18, 2012 7:35 PM IST


టాలీవుడ్ యంగ్ హంక్ రానా దగ్గుబాటి సరికొత్త ట్రెండ్స్ ని ఫాలో అవుతూ ఉంటాడు. ఆరడుగుల పొడుగు మంచి ఫిజిక్ కలిగిన రానా చూడటానికి గ్రీకు వీరుడులా కనపడతాడు. ఇటీవలే ఇచ్చిన ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మీకున్న లేడీ ఫాలోయింగ్ గురించి చెప్పమంటే రానా సమాధానమిస్తూ ‘ నాకు ఇంత లేడీ ఫాలోయింగ్ ఎలా వచ్చిందా అని నాకే అర్థం కావటం లేదు. ఎందుకంటే నేను ఇప్పటివరకూ ఒక లవ్ స్టొరీ కూడా చెయ్యలేదు కానీ నాకు చాక్లెట్ బాయ్ అనే ఇమేజ్ వచ్చేసింది. నాకు తెలిసి అందరూ నన్ను సినిమాల్లో కంటే నా హైట్, నా ఫిజిక్ మరియు నా లైఫ్ స్టైల్ చూసే ఇష్టపడుతున్నారని అనుకుంటున్నానని’ అన్నాడు. ప్రస్తుతం రానా హీరోగా నటించిన ‘కృష్ణం వందే జగద్గురుమ్’ సినిమా నవంబర్ 30 న భారీ ఎత్తున విడుదలకు సిద్దమవుతోంది. నయనతార హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి క్రిష్ దర్శకత్వం వహించారు.

తాజా వార్తలు