గెట్ రెడీ..”రాధే శ్యామ్” టీజర్ ఆల్ మోస్ట్ అప్పటికి ఫిక్స్.?

గెట్ రెడీ..”రాధే శ్యామ్” టీజర్ ఆల్ మోస్ట్ అప్పటికి ఫిక్స్.?

Published on Feb 4, 2021 11:00 AM IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ చిత్రం “రాధే శ్యామ్”. అయితే సినిమా ఏమో కానీ ఈ గ్యాప్ లో మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ ఈ చిత్రం తాలుకా టీజర్ కోసమే ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఇది చాలానే స్పెషల్ అకేషన్స్ ను మిస్ చేసుకొని ఇప్పుడు ఫైనల్ గా ఓ స్పెషల్ డే కు రావడం ఆల్ మోస్ట్ ఫిక్స్ అయ్యినట్టుగా సినీ వర్గాలు చెబుతున్నాయి.

దర్శకుడు రాధా కృష్ణ అండ్ టీం తెరకెక్కించిన ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ టీజర్ ను లవర్స్ డే రోజునే రావడానికి ఫిక్స్ అయ్యినట్టు తెలుస్తుంది. అలాగే ప్రభాస్ క్లోజ్ సోర్సెస్ కూడా ఇదే చెప్తున్నాయి. మరి ఈ మోస్ట్ అవైటెడ్ టీజర్ అప్పుడే వస్తుందా లేదా అన్నది ఇంకొన్ని రోజులు ఓపిక పడితే సరిపోతుంది. యూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న ఈ చిత్రానికి గాను జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. సో ప్రభాస్ ఫ్యాన్స్ గెట్ రెడీ..

సంబంధిత సమాచారం

తాజా వార్తలు