అల్లు శిరీష్, యామిగౌతం జంటగా నటిస్తున్న ‘గౌరవం’ సినిమా ఆడియో కొద్దిసేపటి క్రితమే ఉప్పల్ లో సన్ రైసెర్స్ హైదరాబాద్ కి పూణే వారియర్స్ కి మధ్య జరుగుతున్న ఐ.పీ.ఎల్ మ్యాచ్ లో విడుదల చేసారు. నాగేంద్ర బాబు చేతుల మీదిగా ఆడియో లాంచ్ జరిగింది. ఈ వేడుకకు హీరో హీరొయిన్లు కాకుండా ప్రకష్ రాజ్, అల్లు అరవింద్, చంద్రబోస్, థమన్, గీతా మాధురి హాజరయ్యారు.
ఈ సినిమా హానర్ కిల్లింగ్స్ నేపధ్యంలో సాగుతుంది. ఈ సినిమాని తెలుగు మరియు తమిళ్ లో రాధ మోహన్ తెరకేక్కిస్తున్నాడు. ఈ సినిమాని నిర్మిస్తున్న ప్రకాష్ రాజ్ ఇందులో ముఖ్య పాత్ర కుడా పోషిస్తున్నాడు . ప్రీతా సినిమాటోగ్రఫీ, థమన్ నేపధ్య సంగీతం బాధ్యతలు చేపట్టారు. ఇందులో హీరొయిన్ ఒక యువ న్యాయవాది. ఈ సినిమా ఏప్రిల్ 19 న విడుదల కాబోతుంది.