డబ్బింగ్లో రికార్డు నెలకొల్పబోతున్న ఘంటసాల రత్నకుమార్


ప్రముఖ సంగీత దర్శకుడు, సుప్రసిద్ధ గాయకుడు ఘంటసాల వెంకటేశ్వర రావు గారి అబ్బాయి ఘంటసాల రత్నకుమార్ త్వరలో ఒక రికార్డు నెలకొల్పబోతున్నారు. దాదాపు 30 సంవత్సరాలుగా 1076 చిత్రాలకు డబ్బింగ్ చెబుతూ దాదాపు పది వేలకు పైగా టీవీ సీరియల్ ఎపిసోడ్స్ కి డబ్బింగ్ అందించి సంగీత దర్శకుడిగా, దర్శకుడిగా, రచయితగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా ఎనలేని సేవలు అందిస్తున్న ఘంటసాల రత్నకుమార్ డబ్బింగ్ ఆర్టిస్టులకు గుర్తింపు తెచ్చే ప్రయత్నంలో భాగంగా ఈ నెల 4వ తేదీన ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు నిర్విరామంగా డబ్బింగ్ చెప్పనున్నారు. ఈ విషయాన్ని తెలియజేయడానికి పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయగా తమ్మారెడ్డి భరద్వాజ, సాగర్, ఏవీఎస్, ప్రసన్న కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రత్నకుమార్ మాట్లాడుతూ డబ్బింగ్ పట్ల అవగాహన కోసం ఈ వినూత్న కార్యక్రమం తలపెట్టినట్లు ఈ ప్రయత్నానికి అందరి సహకారం కావాలని అన్నారు. తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ ఈ ప్రయత్నం విజయవంతఃమ్ అయి ఇండస్ట్రీకి మంచి పేరు తీసుకురవలమి కోరుకున్నారు.

Exit mobile version