పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘గబ్బర్ సింగ్’ చిత్రం ప్రస్తుతం హైదరాబాదులోని గాయత్రి హిల్స్ లో జరుగుతుంది. రామ్ లక్ష్మన్ ఆధ్వర్యంలో చిత్రానికి సంబంధించిన కీలక యాక్షన్ సన్నివేశాలు ఇక్కడే చిత్రీకరిస్తున్నారు.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ షెడ్యుల్ ఈ రోజు ముగుస్తుందని ఇంటర్వెల్ కి సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకొని ఏప్రిల్ 27న విడుదలకు సిద్ధమవుతుంది.