పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న గబ్బర్ సింగ్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మలైకా అరోరా పై అన్నపూర్ణ స్టూడియోలోని సేవన్ ఎకర్స్ లో కెవ్వు కేక పాట చిత్రీకరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తరువాత షూటింగ్లో పాల్గొంటాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన పాటలు శిల్ప కళా వేదికలో నిన్న ఘనంగా భిమనుల సమక్షంలో మెగాస్టార్ చిరంజీవి విడుదల చేసారు. ఇప్పటికే ఈ చిత్ర పాటలు అందరినీ అలరిస్తున్నాయి. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంటూ శరవేగంగా అన్ని హంగులూ పూర్తి చేసుకుని మే రెండవ వారంలో భారీ విడుదలకు సిద్ధమవుతుంది. శృతి హసన్ హీరొయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.