గబ్బర్ సింగ్ షూటింగ్ దాదాపు పూర్తి


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ షూటింగ్ ప్రస్తుతం యూరప్లో జరుగుతున్న విషయం తెలిసిందే.ఈ చిత్రానికి సంభందించిన షూటింగ్ అప్డేట్ మాకు ప్రత్యేకంగా లభించింది. ప్రస్తుతం పిల్లా.. పాట చిత్రీకరణ జరుగుతుండగా ఈ పాట చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఇంకా కేవలం ఒక పాట చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న హరీష్ శంకర్ ఈ చిత్ర అవుట్ పుట్ పట్ల చాలా సంతోషంగా ఉన్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర పాటలు ఇటీవలే విడుదలై పిల్లా, కెవ్వు కేక పాటలు మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. నిర్మాత బండ్ల గణేష్ బాబు పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Exit mobile version