పవన్ కళ్యాణ్ నటిస్తున్న గబ్బర్ సింగ్ చిత్రం రేపటితో హైదరాబాద్ లో చిత్రీకరణ పూర్తి చేసుకోనుంది గత కొన్ని రోజులుగా గాయత్రి హిల్స్ లో జరుగుతున్న ఈ చిత్ర చిత్రీకరణ రేపటి తో అక్కడ ముగించుకుంటుంది ఇక్కడ పోరాట సనివేశాలను చిత్రీకరించారు. రేపు షూటింగ్ ముగించుకొని మర్నాడు పొల్లాచ్చి కి బయలుదేరనున్నారు. ఫిబ్రవరి 16 వరకు జరగనున్న పొల్లాచ్చి షూటింగ్ లో ఒక పాట, కొన్ని సన్నివేశాలు మరియు కొన్ని పోరాట సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.
గతంలో ఇక్కడ పొల్లాచ్చి చిత్రీకరించిన సన్నివేశాలు అద్బుతంగా వచ్చింది అని సన్నిహిత వర్గాలు చెపుతున్నాయి. పవన్ కళ్యాణ్ నటన అందరిని మెప్పిస్తుంది అని అంటున్నారు. ఎప్పటి నుండో పవన్ కళ్యాణ్ తో పని చెయ్యాలని ఎదురు చుఊస్తున్న రామ్ – లక్ష్మణ్ మాస్టర్లు ఈ చిత్రం లో పోరాట సన్నివేశాల మీద ప్రత్యేక శ్రద్ద తీసుకొని చేస్తున్నారు ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ కెరీర్ లో చూడనటువంటి పోరాట సన్నివేశాలను చూస్తారని చెపుతున్నారు.
ఈ చిత్రం లో శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా, బ్రహ్మానందం పాత్ర అందరిని ఆకట్టుకుంటుంది అని అంటున్నారు. హరీష్ శంకర్ ఈ చిత్రం మీద పూర్తి నమ్మకంతో వున్నారు. ఈ చిత్రాన్ని గణేష్ బాబు నిర్మిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.