నేడే గబ్బర్ సింగ్ ఆడియో విడుదల

నేడే గబ్బర్ సింగ్ ఆడియో విడుదల

Published on Apr 15, 2012 9:32 AM IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాస్ మసాల యాక్షన్ ఎంటర్ టైనర్ ‘గబ్బర్ సింగ్’ ఆడియో విడుదల ఈ రోజే ఘనంగా మెగా అభిమానుల సమక్షంలో జరగనుంది. హైదరాబాదులోని ప్రముఖ శిల్ప కళా వేదికలో అంగ రంగ వైభవంగా ఈ వేడుక జరగనుంది. గబ్బర్ సింగ్ సినిమాకు మేము మీడియా పాట్నర్ గా ఉన్నాము. ఈ రోజు సాయంత్రం 6:30 నిమిషాలకు ప్రారంభం కానున్న ఈ వేడుకకు సంభందించిన ప్రత్యేక అప్డేట్స్ ఎప్పటికప్పుడు మేము అందిస్తాము. శృతి హసన్ హీరొయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి హరీష్ శంకర్ దర్శకుడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ప్రోమో సాంగ్స్ ఇటీవలే విడుదలై అభిమానుల్ని ఉర్రూతలూగిస్తున్నాయి. పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు