‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమా విజయం తరువాత నితిన్ ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ రూపంలో మనముందుకు రానున్నాడు. ఫోటాన్ కథాస్ బ్యానర్ పై ప్రముఖ దర్శకుడు గౌతం మీనన్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ఈరోజు ప్రసాద్ ల్యాబ్స్ లో ఈ సినిమా ఫస్ట్ లుక్ ని విడుదలచేసారు.
ఈ సభలో గౌతం మీనన్ మాట్లాడుతూ “ఇదివరకు మా సంస్థనుండి తెలుగు మరియు తమిళ భాషలలో లో బడ్జెట్ సినిమాలను నిర్మించాము. ఈ సినిమాతో పెద్ద బడ్జెట్ చిత్రాలకు శ్రీ కారం చుడుతున్నాము. దర్శకుడు ఈ సినిమా స్క్రిప్ట్ ను చెబుతున్నప్పుడు అందులో ప్రేమ, యాక్షన్, రొమాన్స్ మొదలగు అంశాలు కనిపించడంతో వెంటనే అంగీకరించాను. నితిన్ వాళ్ళ నాన్నగారు సుధాకర్ రెడ్డి ఈ ప్రాజెక్ట్ పూర్తికావడంలో ఎంతోకీలక పాత్ర పోషించారు” అని తెలిపారు
నితిన్ సరసన యామి గౌతం నటిస్తుంది. ప్రేమ్ సాయి డైరెక్టర్ . కార్తీక్ సంగీత దర్శకుడు. షూటింగ్ దాదాపు పుర్తికావచ్చింది