అక్టోబర్ర 7న విడుదలకానున్న రజినికాంత్ విక్రమ్ సింహా మొదటిపాట

అక్టోబర్ర 7న విడుదలకానున్న రజినికాంత్ విక్రమ్ సింహా మొదటిపాట

Published on Sep 27, 2013 7:00 PM IST

kochadiyan
రజినికాంత్ నటించిన ‘విక్రమ్ సింహా’ సినిమా ట్రైలర్ విడుదలైన నాటినుండీ దేశమంతా చర్చగా మారింది. చాలా మంది ప్రముఖులు ఈ ట్రైలర్ ను మెచ్చుకున్నారు. మరీ ముఖ్యంగా ట్రైలర్ లో ఏ.ఆర్ రెహమాన్ అందించిన నేపధ్య సంగీతం గురించి అందరూ మెచ్చుకుంటున్నారు.

ఈ సినిమా ఫస్ట్ ఆడియో ట్రాక్ “చూద్దాం ఆకాశం అంతం” అక్టోబర్ 7న విడుదలకానుంది. ఈ సినిమా ఆడియో విడుదల అక్టోబర్ 10న విడుదలకానుంది. ఈ సినిమా మోషన్ క్యాప్చూర్ పరిజ్ఞానంతో మొదటిసారిగా తెరకెక్కిస్తున్నారు. ఇది ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వనుంది

సౌందర్య రజినికాంత్ దర్శకురాలు, కె.ఎస్ రవికుమార్ కధను అందించాడు. దీపికా పదుకునె హీరోయిన్. ఈ సినిమాను ఈరోస్ ఇంటర్నేషనల్, గ్లోబల్ వన్ మీడియా అండ్ సినీమొర్ఫిక్ లిమిటెడ్ సంస్థలు నిర్మిస్తున్నాయి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు