ఎట్టకేలకు తమిళ్లో ఫస్ట్ హిట్ కొట్టింది

ఎట్టకేలకు తమిళ్లో ఫస్ట్ హిట్ కొట్టింది

Published on Nov 20, 2012 12:42 PM IST


కాజల్ అగర్వాల్ కి తెలుగులో మగధీర, డార్లింగ్, బృందావనం, మిస్టర్ పర్ఫెక్ట్, బిజినెస్ మేన్ లాంటి భారీ హిట్లు ఉన్నాయి. కానీ తమిళ్లో మాత్రం ఆమెకి మొన్నటి వరకు ఒక్క హిట్ కూడా లేదు. ఇప్పటి వరకు తమిళ్లో 7 సినిమాల్లో ఆమె నటించగా నాన్ మహాన్ అల్ల ఒక్కటే యావరేజిగా నిలిచింది. కెరీర్ మొదట్లో చిన్న సినిమాల్లో నటించినప్పటికీ సూర్యతో నటించిన మాట్రాన్ (తెలుగులో బ్రదర్స్) కూడా ఫ్లాప్ అయింది. ఇటీవల విజయ్ సరసన నటించిన తుపాకి తమిళ్లో భారీ హిట్ అయింది. కోలీవుడ్లో మొన్నటి వరకు ఆమె మీద ఉన్న ఐరన్ లెగ్ ముద్ర ఈ సినిమాతో పోయింది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో చేస్తున్న నాయక్, సారోచ్చారు, బాద్షా,ఎవడు సినిమాలు వచ్చే ఏడాది విడుదల కానున్నాయి. హిందీలో స్పెషల్ చబ్బిస్, తమిళ్లో కార్తితో అల్ ఇన్ అల్ అజగు రాజా సినిమాలతో బిజీబిజీగా ఉంది

తాజా వార్తలు