స్టైలిష్ – పవర్ కాంబో సెట్టయ్యింది.!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజుతో ఈరోజు సోషల్ మీడియా మరియు సినీ వర్గాల్లో ఆ హవా అలా కొనసాగుతుంది. అలాగే వీటితో పాటుగా పవన్ నటించనున్న సినిమాలకు సంబంధించి కూడా అప్డేట్స్ ఒక్కొక్కటి వస్తున్నాయి. ఇప్పటికే వకీల్ సాబ్ మోషన్ పోస్టర్ తో సోషల్ మీడియా షేక్ అవుతూ ఉండగా పవన్ ఫ్యాన్స్ ఎంతజ్ఞో ఎదురు చూస్తున్న స్టైలిష్ పవర్ కాంబోపై ఇపుడు మరో లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది.

గత కొంత కాలం నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మన టాలీవుడ్ స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డిల కాంబోలో ఒక సినిమా ఉండనుంది అని బజ్ వినిపించిన సంగతి తెలిసిందే. ఇపుడు ఈ ప్రాజెక్ట్ ఇపుడు అనుకున్న విధంగానే కన్ఫర్మ్ అయ్యింది. పవన్ నటించనున్న 29 వ చిత్రం వీరి కాంబోలో రానుండగా ఈ చిత్రానికి రామ్ తళ్లూరి ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ పేరిట నిర్మించనున్నారు. అలాగే ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథను అందించనున్నట్టు తెలుస్తుంది.

Exit mobile version