యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా హీరోయిన్ గా నటించిన అందమైన ప్రేమ కావ్యం “రాధే శ్యామ్”. భారీ బడ్జెట్ తో రాధా కృష్ణ ఈ చిత్రాన్ని ఒక అందమైన పెయింటింగ్ లా తెరకెక్కించారని సినిమా మేకర్స్ అంతా చాలా నమ్మకంగా ఉన్నారు. అయితే మరి ఈ మోస్ట్ అవైటెడ్ సినిమా నుంచి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ అవైటెడ్ అప్డేట్ టీజర్ పై ఎంతో కాలం నిరీక్షణ అనంతరం అందించారు.
మేము ఇంతకు ముందు గెస్ చేసిన విధంగానే ఈ అందమైన ప్రేమ కథా చిత్ర టీజర్ ను ప్రపంచ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విడుదల చేస్తున్నట్టుగా డేట్ ను లాక్ చేసేసారు. దీనితో ప్రభాస్ ఫ్యాన్స్ కు ఎట్టకేలకు ఊరట లభించింది. దానిపై అద్భుతమైన వీడియోను కూడా డిజైన్ చేశారు. ఇప్పటి వరకు ప్రభాస్ లోని మాస్ నే చూసారు ఇప్పుడు అతనిలో ప్రేమను చూద్దురు అంటూ ఒక ప్రీ టీజర్ తో టీజ్ చేశారు. ఇక ఆ స్పెషల్ డే రోజున రాబోయే టీజర్ ఎలా ఉంటుందో చూడాలి.