మొత్తానికి ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘జూనియర్’

మొత్తానికి ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘జూనియర్’

Published on Sep 30, 2025 10:15 AM IST

ఈ ఏడాది మన సౌత్ సినిమా దగ్గర మంచి డెబ్యూ ఇచ్చిన యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో కిరీటి రెడ్డి కూడా ఒకడు. మరి తాను హీరోగా యంగ్ అండ్ సెన్సేషన్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా దర్శకుడు రాధా కృష్ణ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం మాస్ యువతని మెప్పించి హిట్ అయ్యింది. ఇలా మొదటి సినిమా తోనే మంచి సక్సెస్ అందుకున్న ఈ జూనియర్ ఇప్పుడు ఏకంగా పది వారాల తర్వాత ఓటిటిలో సందడి చేసేందుకు వచ్చేసింది.

మరి ఈ సినిమా హక్కులు ఆహా, అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకోగా అందులో ఈ చిత్రం నేటి నుంచి అందుబాటులోకి వచ్చేసింది. సో ఈ సినిమాని అప్పుడు మిస్ అయ్యి ఓటిటిలో చూద్దాం అనుకున్నవారు ఈ చిత్రాన్ని చూడొచ్చు. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ చార్ట్ బస్టర్ ఆల్బమ్ ని అందించగా వారాహి చలన చిత్ర బ్యానర్ వారు తెలుగు, కన్నడ భాషల్లో నిర్మాణం వహించారు.

తాజా వార్తలు