ఫైనల్ గా పట్టాలెక్కనున్న ‘జై హనుమాన్’

ఫైనల్ గా పట్టాలెక్కనున్న ‘జై హనుమాన్’

Published on Nov 18, 2025 9:11 AM IST

jai-hanuman

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ హీరోగా నటించిన సూపర్ హిట్ సూపర్ హీరో చిత్రం ‘హను మాన్’ కోసం అందరికీ తెలిసిందే. ఈ చిత్రాన్ని దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమాకి సీక్వెల్ గా “జై హనుమాన్” ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని 2025 కే అనౌన్స్ చేసినప్పటికీ పరిస్థితులు కుదరక అలా ఆలస్యం అవుతూ వస్తుంది.

అయితే ఈ సినిమాలో కన్నడ స్టార్ నటుడు రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తుండగా తన డేట్స్ ఈ సినిమాకి కుదరక అలా ఆలస్యం అవుతూ వచ్చింది. ఇక ఫైనల్ గా ఈ భారీ సినిమా పట్టాలెక్కేందుకు సిద్ధం అయ్యినట్టు తెలుస్తుంది. దీని ప్రకారం వచ్చే ఏడాది ఈ జనవరి నుంచే మొత్తం ఐదారు నెలలు ప్రశాంత్ వర్మకి రిషబ్ కాల్షీట్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. దీనితో ‘జై హనుమాన్’ కోసం చూస్తున్న ఫ్యాన్స్ కి ఫైనల్ గా ఇదొక గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

తాజా వార్తలు