‘దృశ్యం-3’పై సురేష్ బాబు కామెంట్స్

‘దృశ్యం-3’పై సురేష్ బాబు కామెంట్స్

Published on Nov 18, 2025 3:00 AM IST

మోహన్ లాల్ ‘దృశ్యం-3’ని ప్రకటించినప్పటి నుండి సినిమా ప్రేమికులు ఎంతో ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. ఈసారి హిందీ, తెలుగు భాషల్లో ఒకేసారి చిత్రీకరణ జరగనుందని, వరుసగా అజయ్ దేవగన్, వెంకటేష్ హీరోలుగా నటించనున్నారని నిర్మాతలు స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ.. “దృశ్యం-3 ఎప్పుడు మొదలైనా, తెలుగులో మాత్రం వెంకటేష్‌నే చేస్తారు” అని తెలిపారు. దృశ్యం ఫ్రాంచైజీలో వెంకటేష్ పర్ఫార్మెన్స్‌కు మంచి మార్కులు రావడంతో పాటు బాక్స్ ఆఫీస్ హిట్ కూడా సాధించడం అరుదని అన్నారు.

దర్శకుడు జీతూ జోసెఫ్ ఈ చిత్రాన్ని మరింత రసవత్తరంగా మలుస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దృశ్యం చిత్రాల్లో నటించడం వెంకటేష్‌కు ఎంతో ఇష్టమని, తామంతా మూడో భాగం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని ఆయన అన్నారు.

తాజా వార్తలు