ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో “సలార్” అనే బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ భీకర యాక్షన్ డ్రామాలో ప్రభాస్ లాంటి సాలిడ్ కటౌట్ ను మ్యాచ్ చెయ్యగలిగే విలన్ ఎవరు అనే టాక్ ఎప్పటి నుంచో ఉన్నదే.
అలాగే ఈ సాలిడ్ రోల్ కు సంబంధించి కూడా చాలా మంది టాప్ అండ్ టాలెంటెడ్ నటులు పేర్లు వినిపించాయి. కానీ ఇపుడు అంతర్గత సమాచారం ఏంటి అంటే ఈ సినిమాకు గాను నీల్ కన్నడ ఇండస్ట్రీకు చెందిన మోస్ట్ హ్యాపెనింగ్ విలన్ నే తీసుకున్నట్టు తెలుస్తుంది.
అతడే మధు గురు స్వామి. కన్నడ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉన్న ఈ సాలిడ్ కటౌట్ ను ప్రభాస్ కు సమఉజ్జీ గా ప్రశాంత్ నీల్ బరిలో దింపనున్నట్టు తెలుస్తుంది. మరి అలాగే దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి చాలా మేర కేజీయఫ్ టెక్నిషియన్సే పని చేస్తుండగా హోంబలే ఫిల్మ్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.