100 సంవత్సరాల ఇండియన్ సినిమా సంబరాల కారణంగా ఈ నెల 21 నుంచి – 24 వరకు తెలుగు సినిమా షూటింగ్స్ ని ఆపేశారు. రేపటి నుంచి అన్ని షూటింగ్స్ తిరిగి ప్రారంభం కానున్నాయి. అక్కడి అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని రేపు అందరు నటీనటులు, టెక్నీషియన్స్, దర్శకులు తిరిగి రానున్నారు.
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ‘బాహుబలి’ షూటింగ్ రేపటి నుంచి మొదలు కానుంది. రానా దగ్గుబాటితో కలిసి ప్రభాస్ కూడా షూటింగ్ లో పాల్గొననున్నాడు, అలాగే మరికొంతమంది కీలక నటీనటులు కూడా షూటింగ్ లో పాల్గొననున్నారు. నితిన్ నటిస్తున్న ‘హార్ట్ అటాక్’ సినిమా కూడా హైదరాబాద్ లో రెండు మూడు రోజులు షూటింగ్ జరుపుకోనుంది. ఆ తర్వాత ఈ చిత్ర యూనిట్ లాంగ్ షెడ్యూల్ కోసం స్పెయిన్ వెళ్లనున్నారు.
ఈ రెండు సినిమాలతో పాటు వేరే సినిమాల షూటింగ్ కూడా రేపటి నుంచి మొదలు కానుంది.