బాలయ్య-బోయపాటిల హ్యాట్రిక్ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఈ మధ్య బాలయ్య నటించిన చిత్రాలు వరుసగా నిరుత్సాహపరిచిన నేపథ్యంలో ఈ చిత్రం వారి దాహం తీర్చుతుందని భావిస్తున్నారు. కాగా ఈ మూవీకి టైటిల్ మోనార్క్ అని ప్రచారం జరుగుతుంది. ఈ టైటిల్ డిఫరెంట్ గా ఉండడంతో పాటు పవర్ ఫుల్ గా కూడా ఉండడంతో, అదే కన్ఫర్మ్ చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నారట.
మరి టైటిల్ మోనార్క్ నేపథ్యంలో ఇక బాలయ్య పాత్ర ఏ రేంజ్ లో ఉంటుందో అని ఫ్యాన్స్ అంచనా వేసుకుంటున్నారు. ఈ మూవీలో బాలయ్య అఘోర పాత్ర కూడా చేయడం ఆసక్తి పెంచుతున్న మరో అంశం. ఇక బాలయ్య పుట్టినరోజు కానుకగా ఈనెల 10న విడుదలైన మూవీ టీజర్ విశేష ఆదరణ దక్కించుకుంది. ముఖ్యంగా ఆయన లుక్ కి మంచి మార్కులు పడ్డాయి. ఈ చిత్రాన్ని మిర్యాల రవీంద్రా రెడ్డి నిర్మిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నాడు.