వెంకీని పొగుడుతున్న ఫెయిల్యూర్ డైరెక్టర్

వెంకీని పొగుడుతున్న ఫెయిల్యూర్ డైరెక్టర్

Published on Oct 2, 2012 1:40 PM IST


విక్టరీ వెంకటేష్ కొత్త స్టైలిష్ లుక్ తో కనిపిస్తూ రాబోతున్న షాడో టీజర్ ఈ రోజు ఉదయం విడుదల చేసారు. షాడో చిత్ర దర్శకుడు మెహర్ రమేష్ డైరెక్షన్లో వచ్చిన గత చిత్రాలు ఏవీ విజయం సాధించలేక బాక్స్ ఆఫీస్ బోల్తా పడ్డాయి. సక్సెస్ ఉన్నప్పుడు ఎవరైనా మన వెనుక ఉంటారు, కాని ఫెయిల్యూర్లో ఉన్న నాకు వెంకటేష్ గారు అండగా నిలిచి నాకు ఈ సినిమా అవకాశం ఇచ్చారని మెహర్ రమేష్ అన్నాడు. మెహర్ రమేష్ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా తీసుకుని తీస్తున్నారు. ఫ్యామిలీ హీరోగా ఉండే వెంకటేష్ గారిని ఈ సినిమాలో చాలా స్టైలిష్ గా చూపిస్తున్నారు. ఈ చిత్ర రచయితల్లో ఒకరైన కోన వెంకట్ మాట్లాడుతూ ‘నిన్న షాడో ఫస్ట్ లుక్ రిలీజ్ అవగానే చాలా మందికి నిద్ర లేకుండా పోయింది, ఈ రోజు టీజర్ తో మనశ్శాంతి లేకుండా పోతుంది’ అన్నారు.

తాజా వార్తలు