పవన్ సినిమాపై మరింత పెరుగుతున్న అంచనాలు.!

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేపట్టిన పలు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులలో విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న వీరమల్లు(పరిశీలనా టైటిల్) కూడా ఒకటి. పవన్ కెరీర్ లోనే మొట్టమొదటి పీరియాడిక్ అండ్ భారీ బడ్జెట్ చిత్రం ఇది. అయితే ఈ రెండు అంశాలు అనే కాకుండా ఈ కాంబినేషన్ అనగానే భారీ అంచనాలు సెట్టయ్యాయి.

అందుకే ఈ చిత్రం విషయంలో ఏ చిన్న అంశం బయటకు వచ్చినా గట్టిగా వైరల్ అవుతుంది. అలా లేటెస్ట్ గా ఈ చిత్రం కోసం ఏకంగా 17వ శతాబ్దం నాటి చార్మినార్ సెట్ నే వేస్తున్నారన్న టాక్ బయటకు రాగా ఈ సినిమాను ఏ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారో అర్ధం చేసుకోవచ్చని సినీ వర్గాలు చెబుతున్నాయి.

అంతే కాకుండా ఇక్కడ నుంచి ఈ సినిమాపై అంచనాలు మరో స్థాయికి కూడా వెళ్లాయి. అంతే కాకుండా పవన్ రోల్ కు సంబంధించి క్రిష్ డిజైన్ చేస్తున్న విధానం కూడా ఆసక్తికరంగా వినిపిస్తుంది. మొత్తానికి మాత్రం ఈ భారీ ప్రాజెక్ట్ పై అంచనాలు గట్టిగానే ఏర్పడుతున్నాయి. మరి ఈ చిత్రాన్ని మేకర్స్ ఎప్పుడు తీసుకొస్తారో చూడాలి.

Exit mobile version