ప్రత్యేకం : అక్టోబర్17న మొదలుకానున్న పూరి – అల్లు అర్జున్ సినిమా

ప్రత్యేకం : అక్టోబర్17న మొదలుకానున్న పూరి – అల్లు అర్జున్ సినిమా

Published on Sep 30, 2012 3:00 PM IST


‘జులాయి’ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఇద్దరు అమ్మాయిలతో’ అనే టైటిల్ తో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రానికి సంబందించిన ప్రత్యేకమైన సమాచారాన్ని మీకందిస్తున్నాము. ఈ చిత్రం అక్టోబర్ 17న లాంచనంగా ప్రారంభం కానుంది. అలాగే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ 25 నుండి ప్రారంభం అవుతుంది. టైటిల్ కి తగ్గట్టుగానే ఈ చిత్రంలో ఇద్దరు కథానాయికలు ఉంటారు, అందులో ఒక ఒక కథానాయికగా అమలా పాల్ ఎంపికైంది, మరో హీరొయిన్ ఎంపిక కావాల్సి ఉంది. ‘గబ్బర్ సింగ్’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వరుసగా పెద్ద హీరోలతో సినిమాలు ప్లాన్ చేస్తున్న బండ్ల గణేష్ గారు పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. పూరి – బన్ని కాంబినేషన్లో 2007లో వచ్చిన ‘దేశ ముదురు’ మంచి విజయాన్ని అందుకుంది, మళ్ళీ ఆ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం యొక్క చిత్రీకరణ ఎక్కువభాగం విదేశాల్లోనే జరగనుంది. ఈ చిత్రానికి సంబందించిన మిగిలిన వివరాలు త్వరలోనే అధికారికంగా తెలియజేయనున్నారు.

తాజా వార్తలు