ప్రత్యేకం : ‘రెబల్’ సినిమాలో కత్తిరించిన సన్నివేశాలు

ప్రత్యేకం : ‘రెబల్’ సినిమాలో కత్తిరించిన సన్నివేశాలు

Published on Sep 30, 2012 10:07 AM IST


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘రెబల్’ చిత్రం గురించి మీకొక ఆసక్తికరమైన విషయాన్ని అందిస్తున్నాం. గత శుక్రవారం ఈ చిత్రం విడుదలైంది మరియు ఈ చిత్ర కలెక్షన్స్ చాలా బాగున్నాయి. ఈ చిత్రం చూసిన అందరి నోటా వినిపిస్తున్న విషయం ఏమిటంటే సినిమా నిడివి ఎక్కువ ఉందని అంటున్నారు. అది పరిగణలోకి తీసుకున్న ఈ చిత్ర టీం సినిమాలో సుమారు 15 నిమిషాలు కత్తిరించారు. కత్తిరించిన సన్నివేశాలను మీకందిస్తున్నాం..

1. మొదట్లో ప్రభాస్ మరియు బ్రహ్మానందం మధ్య వచ్చే కొన్ని బిట్స్ కత్తిరించారు.
2. కోవై సరళ స్విమ్ సూట్ సీక్వెన్స్ మరియు కొన్ని డాన్స్ సన్నివేశాలు కట్ చేసారు.
3. ఎం.ఎస్ నారాయణ ఎపిసోడ్ కట్ చేసారు.
4. ఫ్లాష్ బ్యాక్ తర్వాత తమన్నా మరియు ప్రభాస్ మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలను కత్తిరించారు.

ఈ సన్నివేశాలు కట్ చేసిన తర్వాత సినిమా చూడటానికి బాగుంటుంది. ఈ సన్నివేశాలు కట్ చేసిన వెర్షన్ ఈ రోజు సాయంత్రం నుంచి థియేటర్లో అందుబాటులో ఉంటాయి.

తాజా వార్తలు