ప్రత్యేకం : చివరి దశకు చేరుకున్న కళ్యాణ్ రామ్ 3D సినిమా

ప్రత్యేకం : చివరి దశకు చేరుకున్న కళ్యాణ్ రామ్ 3D సినిమా

Published on Apr 12, 2012 10:05 AM IST


నందమూరి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం ‘ఓం’ అనే 3D సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం కోసం ఫిలిం నగర్లో ప్రత్యేకంగా ఒక సెట్ వేసి షూటింగ్ చేస్తున్నారు. ఈ నెల 26 వరకు ఈ షెడ్యుల్ జరగనుంది. 3D అవుట్ పుట్ కోసం భారీ స్థాయిలో పోస్ట్ ప్రొడక్షన్ చేస్తున్నారు. కళ్యాణ్ రామ్ సరసన కృతి ఖర్భంద, మరియు నికిషా పటేల్ నటిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సునీల్ రెడ్డి దర్శకుడిగా మారి చిత్రీకరిస్తున్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ కొత్త లుక్ తో కనిపించనున్నాడు. తెలుగుతో పాటుగా ఇతర భాషల్లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేసే సన్నాహాలు చేస్తున్నారు.

తాజా వార్తలు