ప్రత్యేక సమాచారం: దమ్ము మూవీ వివరాలు


యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దమ్ము’ చిత్రానికి సంభందించిన ప్రత్యేక సమాచారం మాకు లభించింది. ఈ చిత్ర పూర్తి నిడివి 2 గంటల 39 నిముషాలు కాగా మొదటి భాగం 92 నిముషాలు మరియు రెండవ భాగం 67 నిముషాలు. మేము ఇంతకు ముందు చెప్పినట్లు ఈ సినిమా రెండభాగంలో కొన్ని హై వోల్టేజ్ సన్నివేశాలు ఉన్నాయి. బ్రహ్మానందం, అలీ, ఆహుతి ప్రసాద్ కామెడీ బాగా పండించారు. రెండవ హీరొయిన్ గా నటించిన కార్తీక కూడా తన పాత్రతో బాగా మెప్పించిందని సమాచారం. ఎమ్ఎమ్ కీరవాణి అందించిన నేపథ్య సంగీతం సినిమాకి మెయిన్ హైలెట్ అబి చెబుతున్నారు. బోయపాటి శ్రీను డైరెక్షన్ అందించిన ఈ చిత్రం ఈ నెల 27 న విడుదలకి సిద్ధమైంది.

Exit mobile version