పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్రానికి సంబందించిన ఒక ప్రత్యేక సమాచారం మా దగ్గర ఉంది. అదేమిటంటే ఈ చిత్రం రేపు ఉదయం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకోనుంది. ఈ చిత్రాన్ని భారీ ఎత్తున ఈ నెల 18న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి వచ్చే సెన్సార్ సర్టిఫికేట్ మీద ఈ చిత్ర పూర్తి కేంద్ర పాలిత ప్రాంతాల బుజినెస్ ఆధారపడి ఉంది. చాలా మంది అభిమానులు మాత్రం యు/ఎ రేటింగ్ వస్తుందని అనుకుంటున్నారు, కానీ ఇది పూరి జగన్నాథ్ సినిమా కావడంతో ఈ చిత్ర రేటింగ్ అధికారికంగా వచ్చే వరకు మనము దేనికీ కమిట్ అవ్వలేము.
మిల్క్ బ్యూటీ తమన్నా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో గాబ్రియేల బెర్తంతే కీలక పాత్రలో కనిపించనున్నారు. స్వరబ్రహ్మ మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వంతో పాటు ఆయన మార్క్ తో కూడిన డైలాగ్స్ కూడా బాగా రాసారు. ఇప్పటికే ట్రైలర్లో విడుదలైన డైలాగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. డి.వి.వి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మాకు సెన్సార్ సర్టిఫికేట్ గురించి సమాచారం రాగానే మీకు అందజేస్తాము.