ప్రతీ బాల్ సిక్సర్ కొడుతున్న ‘ఓజి’ మేకర్స్!

ప్రతీ బాల్ సిక్సర్ కొడుతున్న ‘ఓజి’ మేకర్స్!

Published on Sep 2, 2025 6:00 PM IST

OG movie

రెండు తెలుగు రాష్ట్రాల ఒకే ఒక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నేడు కావడంతో ఆ హంగామా యుఫోరియా అంతా నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుంది. సినీ నటులు నుంచి రాజకీయ నాయకులు దేశ ప్రధాని నరేంద్ర మోడీ వరకు కూడా అనేకమంది విషెస్ చెప్పారు. ఇక ఈ హై మూమెంట్స్ తో పాటుగా పవన్ సినిమా అప్డేట్స్ అభిమానులకి ఇంకో బోనస్ అని చెప్పాలి.

ఇక ఈ సినిమాల్లో ‘ఓజి’ చిత్రం నుంచి వస్తున్న ప్రతీ అప్డేట్ కూడా ఒక సిక్సర్ లా నిలుస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అనౌన్స్మెంట్ చేసిన రోజు నుంచి ఇప్పుడు వచ్చిన గన్స్ అండ్ రోజెస్ గ్లింప్స్ వరకు కూడా మేకర్స్ చూపించిన క్వాలిటీ, సుజీత్ విజన్ గాని ఎక్కడా చిన్నది కూడా ఫ్యాన్స్ ని డిజప్పాయింట్ చేసింది లేదు.

దీనితో ఒకో అప్డేట్, పోస్టర్, టీజర్, పాట, గ్లింప్స్ లతో అంచనాలు పెరుగుతూనే వెళుతున్నాయి తప్పితే తగ్గిన ఆనవాలు కూడా లేదు. ఈ రేంజ్ లో ఓజి చుట్టూతా పాజిటివ్ ఆరా కనిపిస్తుంది. మరి ఈ సెప్టెంబర్ 25 వరకు ఇదే కంటిన్యూ అయ్యి సాలిడ్ టాక్ పడితే మాత్రం ఓజి బాక్సాఫీస్ ర్యాంపేజ్ కి ఆకాశమే హద్దని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు